గ్రేట్ : పిలిచి మరీ.. ఆఫర్ ఇచ్చాడట !

యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోలని మించిపోయాడు. స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ.. ల కంటే విజయ్ తో సినిమా చేసేందుకు దర్శక-నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. స్టార్ దర్శక-నిర్మాతలు, బడా బ్యానర్లు విజయ్ కోసం క్యూలో నిలబడుతున్నారు. ఐతే, వారికెవ్వరికి విజయ్ దొరకడం లేదు. ప్రస్తుతం బిజీ. చూద్దాం.. చేద్దాం అన్నట్టుగా
మాట్లాడుతున్నాడు. అలాంటి విజయ్ ఓ యువ దర్శకుడిని పిలిచి మరీ.. తన సినిమా ఆఫర్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హుషారు’ సినిమా సూపర్ హిట్టయింది. మంచి సినిమా అనిపించుకొంది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి టాలెంట్ విజయ్ ని ఆకర్షించింది. దీంతో శ్రీ హర్షి ని విజయ్ పిలిచి మరీ.. సినిమా ఆఫర్ ఇచ్చారట. దీంతో ఈ దర్శకుడి పరిస్దితి గాల్లో తేలినట్లు ఉంది. దేవరకొండ తో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ‘హుషారు’ దర్శకుడితో విజయ్ సినిమా ఉండొచ్చని చెబుతున్నారు.