‘మహర్షి’లో అల్లరోడి లుక్ చూశారా.. ?


‘మహర్షి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో జెడ్ స్వీడుతో షూటింగ్ ని పూర్తిచేసే పనిలో చిత్రబృందం ఉంది. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలని మొదలెట్టారు.

ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అల్లరి నరేష్, దిల్ రాజు, దర్శకుడు వంశీపైడిపల్లి కనిపిస్తున్నారు. అల్లరోడు గడ్డెం లుక్ లోకి కనిపిస్తున్నారు. ‘గమ్యం’ సినిమాలో గాలి శీను గెటప్ కి దగ్గరగా అల్లరోడి లుక్ ఉంది. సినిమాలోనూ అల్లరోడు ఇదే లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమాలో మహేష్ స్నేహితుడిగా నరేష్ కనిపిస్తాడట. సినిమాలో మహేష్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రెండు పాత్రలకి సంబంధించిన లుక్స్ బయటికొచ్చాయి. మహేష్ రైతు పాత్రలో కనిపించి లుక్ విడుదల కావాల్సి ఉంది. ఆ లుక్ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.