సీనియర్ నటుడు బత్తుల కన్నుమూత

సీనియర్ నటుడు బత్తుల వీరవెంకట రంగారావు అలియాస్ రాంబాబు (82) కన్నుమూశారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రాంబాబు.. ఎస్వీ రంగారావుకి ఆప్తమిత్రుడు.

బత్తుల.. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ఆఫీస్ మేనేజర్గా సుదీర్ఘకాలం పని చేశారు. పలు పాత చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు. రాంబాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.