‘యాత్ర’లో జగన్ నటన అదిరిపోయింది !

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని ‘యాత్ర’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. భారీ అంచనాల మధ్య ‘యాత్ర’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బినిఫిట్ షో పడిపోయాయి. యాత్ర పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. సినిమాలో జగన్ నటన హైలైట్ అని చెబుతున్నారు ప్రేక్షకులు. అలాగని యాత్రలో జగన్ నటించలేదు. కాకపోతే.. జగన్ రియల్ స్పీచ్ లని వాడుకొన్నారంతే.

నేరుగా కథలోకి వెళ్లి ఎమోషనల్ గా కథని నడిపారు దర్శకుడు. సినిమాలో మెయిన్ గా కథ కంటే వైఎస్ కి సంబంధించిన పొలిటికల్ సిచువేషన్స్ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయారు. ఆయన నటన సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ఐతే, క్లైమాక్స్ లో జగన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. జగన్ తండ్రి గురించి మాట్లాడే ఒరిజినల్ సీన్ తో సినిమాని ముగించారు. ఆసమయంలో ఈలలు, కేకలతో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. దానికి సంబంధించిన వీడియో బయటికొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.