ఎర్రబెల్లి ఖుషి అయ్యిండు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినేట్ లో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణలో మొత్తం పది మందికి అవకాశం దక్కింది. మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్ లని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.
రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు.
మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరిని కలుపుకొని పనిచేస్తానన్నారు. గతంలో తెదేపా హయాంలో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానన్నారని.. కానీ అప్పుడు లక్ష్మీపార్వతి వల్ల తనకు పదవి రాలేదని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఇప్పుడు కేసీఆర్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.