అనిల్.. మహేష్ హ్యాండిచ్చాడా.. ?

‘ఎఫ్2’ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మహేష్ నటించబోయేది అనిల్ దర్శకత్వంలోనే నని చెప్పుకొంటున్నారు. ఐతే, ఇప్పుడీ వాయిదా పడినట్టు సమాచారమ్.

మహేష్ తో అనిల్ సినిమా ఉంటుంది. కానీ, అది ఇప్పుడే కాదు. ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఈలోపు అనిలో మరో సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్. అది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. మరీ.. ఇందులో హీరోయిన్ ఎవరు ? సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయని చెబుతున్నారు.