మెగా ఫ్యాన్స్ నుంచి నానికి వార్నింగ్.. !

మెగా హీరోలని నాని మోసం చేశాడు. ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్ లో నటించాలని రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా మెగా హీరోలంతా ఆశపడ్డారు. గ్యాంగ్ లీడర్ కావాలనే కోరిక రామ్ చరణ్ కి ఇంకాస్త ఎక్కువగానే ఉండేది. ఐతే, ఇప్పుడీ టైటిల్ ని నాని వాడేసుకొంటున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆదివారం (ఫిబ్రవరి 24) నాని బర్త్ డే కానుకగా గ్యాంగ్ లీడర్ టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.

ఇప్పుడీ టైటిల్ ని నాని వాడుకోవడంపై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. 1990లో వచ్చిన మెగాస్టార్ చిరంజెవి ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ టైటిల్ వాడుకొనే అర్హత కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రమే ఉంది. రామ్ చరణ్ ని కాదని నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ ని ఎలా వాడుకొంటాడు ? అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టైటిల్ మార్చకుంటే సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తామని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారు. మరీ.. వార్నింగ్ లకి నాని తలొగ్గుతాడా?అన్నది చూడాలి