సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్
భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ,అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) ప్రాంతాల్లో ఆర్మీ, బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించాయి. ఆ ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశాయి.పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను ఉల్లంఘించి భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలు జరపడం, గత రాత్రంతా పాక్ భారీగా కాల్పులకు పాల్పడడం వంటి చర్యలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నియంత్రణ రేఖకు ఐదు కిలోమీటర్ల దూరంలోపు రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఉండే విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసేయాలని ఆదేశించారు.
ఇదిలావుండగా.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకొంది. తమ విమాన సర్వీసులు పాక్ గగనతలం మీదుగా వెళ్లకుండా ఎయిరిండియా చర్యలు చేపట్టింది. గల్ఫ్‌తోపాటు యూఎస్, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లిస్తున్నామని.. తక్షణమే వీటిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.