పాక్ అదుపులో భారత పైలట్ ?
భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్‌కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్‌లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ అనే పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ చెబుతోంది. ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్ కమాండర్ అభినందన్ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. మరోవైపు, భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్ ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగానే ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Indian Air Force’s Wing Commander Vikram Abhinandan apprehended by Pakistan alive.
Indian government has so far refuted claims of any of their pilots being missing.#Kashmir #AirSurgicalStrikes pic.twitter.com/WW8e4loVMq— The God’s Particle! (@BurhanSpeaks) February 27, 2019