నగ్మా పెళ్లి.. !
ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నగ్మా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. నగ్మ తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరువిప్పారు.
‘తనకు దాంపత్య జీవితంపై నమ్మకం ఉందని.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ప్రస్తుతం తన జీవితంలో ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు. సరైన వ్యక్తి దొరికినప్పుడు అందరి సమక్షంలో వివాహమాడతా’నని పేర్కొన్నారు.
తెలుగులో ‘కిల్లర్’, ‘ఘరానా మొగుడు’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘బాషా’, ‘కొండపల్లి రాజా’ తదితర చిత్రాల్లో నటించి నగ్మా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చివరిసారిగా 2007లో వచ్చిన ‘తూ హమారా హో’ అనే భోజ్పురి చిత్రంలో నటించారు. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయిపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.