తెదేపా ఆస్తి దొంగిలించారు
తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అహంభావంతో కేసీఆర్, అసహనంతో జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి. ఏ పార్టీకి లేని సాంకేతికత తెదేపా సొంతమని, తెలుగు దేశం పార్టీ 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే.. దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని సీఎం దుయ్యబట్టారు. తెదేపా సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ ముసుగు తీసి ప్రచారం చేయాలని.. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.