మహేష్ రెమ్యూనిరేషన్ 50 కోట్లు?


మహేష్-సుకుమార్ సినిమా పక్కకుపోయింది.అనిల్ రావిపూడి డైరక్షన్’లో సినిమా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాని దిల్ రాజు-అనిల్ సుంకరలో ఎవరు ప్రొడక్షన్ చేస్తారు అన్నది తేలాలి. ఈ సినిమా మహేష్ బాబుకు ఓ హాటెస్ట్ డీల్ అని తెలుస్తోంది.

ఈ సినిమాకు గాను మహేష్ బాబుకు అత్యధిక రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ కు 50 కోట్లు ముడతాయట.సినిమా ప్రొడక్షన్ కాస్ట్ జస్ట్ యాభైకోట్లు (మహేష్ రెమ్యూనిరేషన్ కాకుండా) వుంటుందని తెలుస్తోంది.

సినిమాకు థియేటర్ రైట్స్ కనీసం వందకోట్లు వుంటాయని అంచనా వేస్తున్నారు. అందులో మహేష్ కు సగం, మిగిలినది ఇద్దరు నిర్మాతలకు సగం సగం అన్న లెక్కలు వేసారని టాక్ వినిపిస్తోంది.