వైరల్‌ : ప్రభాస్‌ చెంపపై కొట్టిన అభిమాని


‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన ‘సాహో’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కొందరు అభిమానులు ప్రభాస్‌ను చూసి సెల్ఫీల కోసం ఎగబడ్డారు.ఈ నేపథ్యంలో ఓ యువతి సెల్ఫీ కావాలని ప్రభాస్‌ను అడగ్గా ఆయన వెంటనే ఒప్పుకొని ఫొటోకు పోజిచ్చారు.

ప్రభాస్‌తో సెల్ఫీ దిగానన్న ఆనందంతో ఆ యువతి ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ ఆనందంలో ప్రభాస్‌ చెంపపై చిన్నగా అలా కొట్టి వెళ్లిపోయింది. దాంతో ప్రభాస్‌ తన చెంపను రుద్దుకుంటూ నవ్వుకున్నారు. ఆ యువతి ప్రభాస్‌ చెంపను తాకినప్పుడు ఓ అభిమాని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.