మళ్లీ.. హిందూపురం నుంచి బాలకృష్ణ !
హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి మళ్లీ బాలకృష్ణ బరిలోకి దిగనున్నారు. ఆయన పేరును పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖరారు చేశారు.
గురువారం అనంత నేతలతో చంద్రబాబుసమావేశమయ్యారు.
పార్లమెంట్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకే మళ్లీ అవకాశం కల్పించారు. పెనుగొండ నుంచి పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, మడకశిర నుంచి వీరన్న, రాప్తాడు నుంచి పరిటాల సునీతలు బరిలోకి దిగనున్నారు.
కదిరి నియోజకవర్గ అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానానికి చాంద్‌పాషా, కందికుంట ప్రసాద్ పోటీ పడుతున్నారు.