మహేష్ జంటగా నయన్, అనుష్క.. !


సూపర్ స్టార్ మహేష్ బాబుతో లేడీ సూపర్ స్టార్స్ నయనతార, అనుష్కలు రొమాన్స్ చేయబోతున్నారా.. ? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సినిమాల స్టయిల్ లో ‘మహర్షి’ ఉండబోతుందని సమాచారమ్.

ఇక, ఈ సినిమా తర్వాత ‘ఎఫ్ 2’ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన అనిల్.. నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముందుగా మహేష్ కోసం హీరోయిన్ ని సెలక్ట్ చేసే పనిలో ఉన్నాడట. అనిల్ మనసులో నయన్, అనుష్క ఉన్నట్టు తెలుస్తోంది.

“నయన్, అనుష్క లను ఉద్దేశించి అనిల్ ఓ ట్విట్ చేశారు. ‘వీరి జిమ్ వీడియోలు ఉండవు. సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండవు. పబ్లిక్ ఫంక్షన్స్ లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేయరు. ఆఫర్స్ కోసం ఇప్పటికీ రూల్స్ ఫాలో అవుతారు.. రియల్ లేడీ సూపర్ స్టార్స్” అంటూ నయన్, అనుష్క ఫోటోలని షేర్ చేశాడు అనిల్. దీంతో మహేష్ తో చేయబోయే సినిమా కోసం అనిల్.. వీరిద్దరిని ఎంపిక చేసినట్టు ఉన్నాడని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే.. ఫ్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ… !