కేసీఆర్ ’15-15-15′ సెంటిమెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విషయంలోనూ ముహూర్తాలని ఫాలో అవుతుంటారు. ముందస్తుకు వెళ్లడం, కేబినేట్ విస్తరణ విషయంలోనూ సీఎం కేసీఆర్ ముహూర్తబలంని ఫాలో అయ్యారని చెబుతుంటారు. ఇప్పుడు లోక్ సభ అభ్యర్థులని ప్రకటించే విషయంలోనూ కేసీఆర్ సెంటిమెంట్ ని ఫాలో కాబోతున్నట్టు సమాచారమ్.

15 అంకె కలిసి వస్తుందనే నమ్మకం కేసీఆర్ కు ఉంది. అందుకే ఈనెల 15న 15 మందితో జాబితా ఇవ్వాలనే ఆలోచన ఉన్నారని తెలిసింది. ఇప్పటికే ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌). బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), జి.నగేశ్‌ (ఆదిలాబాద్‌)ల పేర్లు ఖరాయ్యాయి. మహబూబ్‌నగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ నియోజకవర్గాల పార్లమెంటు సభ్యులు జితేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆజ్మీరా సీతారాంనాయక్‌ మరోసారి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.