మోడీ, రాహుల్ కు ప్రత్యామ్నాయం కేసీఆర్ !
దేశంలో మోదీ, రాహుల్ తప్ప ఇంకా నాయకులే లేరా ? అని ప్రశ్నించారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం
సికింద్రాబాద్‌లో తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. సబ్‌కా సాత్ అంటూ.. తెలంగాణ ప్రజలకు మోదీ హాత్ ఇచ్చారని విమర్శించారు. దేశంలో నల్లధనం వెలికితీసి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారని.. ఆ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో తెరాస 16 ఎంపీ స్థానాలని గెలుచుకోవాలి. తద్వారా కేంద్రం మొడలు వంచి తెలంగాణ రావాల్సిన నిధులని తెచ్చుకోవచ్చని ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ఈసారి భాజపా, కాంగ్రెస్ కలిసినా.. 273 స్థానాల్లో విజయం సాధించలేవని చెబుతున్నాడు. అందుకే ఫెడరల్ ఫ్రెంట్ కీలకం కానుంది. తెరాస మాదిరిగా బీజేపీ, కాంగ్రెస్ లకి దూరంగా ఉండాలనుకొనే పార్టీలు ఈసారి దాదాపు 100 సీట్లు గెలుచుకోనున్నాయని కేటీఆర్ చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రంలో మోడీ, రాహుల్ కి కేసీఆర్ ప్రత్యామ్నాయం కాబోతున్నాడని కేటీఆర్ పరోక్షంగా చెబుతున్నట్టు కనిపిస్తోంది.