బెదిరింపులపై మురళీ మోహన్ రియాక్షన్

రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ ఈసారి పోటీకి నిరాకరించిన సంగతి తెలిసిందే. నేతలు టికెట్లు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటే.. మురళీ మోహన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని వదలుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. బెదిరింపుల కారణంగానే మురళీ మోహన్ పోటీ నుంచి తప్పుకొన్నారు. ఆయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరించారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై మురళీ మోహన్ స్పందించారు.

‘బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. తనని తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరించాడనే ప్రచారంలో నిజం లేదు. పోటీలో లేకున్నా టీడీపీ గెలుపుకోసం ప్రచారం చేస్తా. రాజమండ్రి నుంచి కోడలు మాగంటి రూపని బరిలోకి దింపే విషయంలో ఆలోచనలు చేస్తున్నా’నన్నారు మురళీ మోహన్. ఐతే, ప్రచారం చేసే ఓపిక ఉండి కూడా పోటీ నుంచి తప్పుకోవడం ఏంటన్నది మురళీ మోహన్ పై వస్తున్న కొత్త ప్రశ్న. పోటీ నుంచి తప్పుకోవడానికి గల అసలు నిజాలని మురళీ మోహన్ బయటికి చెప్పేలా కనిపించడం లేదు.