మోడీని ఎప్పుడైనా.. ఇలా చూశారా.. ?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ దూకుడు పెంచాడు. రఫెల్ డీల్ విషయంలో రాహుల్ ప్రధాని మోడీకి లక్షల కొద్ది ప్రశ్నలు సంధించారు. వాటికి మోడీ దగ్గర సమాధానం లేదు. అందుకే ఆయన మౌనం వహిస్తున్నారని రాహుల్ విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులతో ప్రధాని మోడీ గురించి పలు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు రాహుల్. చెన్నై పర్యటనలో ఉన్న రాహుల్ బుధవారం స్టెల్లా మేరీ కళాశాలలో సమావేశం అయ్యారు. దాదాపు 3000 మహిళా విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ గురించి విద్యార్థులని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ప్రధాని మోదీతో మాట్లాడి, ఆయనను ప్రశ్నించే అవకాశం మీలో ఎంతమందికి వచ్చింది ? విద్యా రంగం గురించి ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మీలో ఎవరైనా అడిగారా ? 3,000 మంది మహిళల మధ్య ఇలా నాలా నిలబడి మోదీ మాట్లాడుతుండగా మీరు ఎప్పుడైనా చూశారా ? ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా ? వరుస ప్రశ్నలు సంధించారు రాహుల్.

అంతేకాదు.. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలని ఉదాహరణలతో విమరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దేశ ప్రజల పరిస్థితులు మారుతాయి. కాంగ్రెస్.. ప్రజలంతా సంతోషంగా, సాధికారతతో జీవించేలా చేస్తుంది. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలి. అది వాద్రా అయినా సరే.. ప్రధాని అయినా సరే అంటూ ఆసక్తికర ప్రసంగం చేశారు రాహుల్.