హీరో విజయ్ దేవరకొండకు పెద్ద సమస్య !

టాలీవుడ్ యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ పెద్ద సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రెడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమా తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనుంది.

తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. ఈ చిత్రానికి “హీరో” అనే టైటిల్ ఖరారు చేశారు. ఏప్రిల్ 22న ఢిల్లీలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలో సినిమా ప్రారంభోత్సవం ఎందుకు ? అన్నది తెలీదు. ఇదిలావుండగా తమిళ్ లో ‘హీరో’ టైటిల్ తో సినిమారాబోతుంది. ఈ చిత్రంలో శివ కార్తీకేయన్ హీరోగా నటిస్తున్నారు. దీంతో విజయ్ సినిమాకి కోలీవుడ్ లో టైటిల్ కష్టాలు తప్పేలా లేవు. తెలుగు, కన్నడలోనూ విజయ్ హీరోగా, తమిళ్ లో మరో టైటిల్ ని ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి.