విజయ్ దేవరకొండకి పెళ్లి చేయబోతున్న దర్శకుడు

దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. దర్శకుడు రాజమౌళి తన సినిమాల్లో ఎమోషన్స్ బలంగా ఉండేలా చూసుకొంటాడు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. కొరటాల శివ సామాజిక అంశాల ఇతివృత్తంగా సినిమాలు తీస్తుంటాడు. బోయపాటి, వివి వినాయక్ లది మాస్ రూటు. వీరి సినిమాల్లో యాక్షన్ అదిరిపోయేలా ఉంటుంది. కొత్త దర్శకులు తమ తమ స్టయిల్ లో సినిమాలు తీస్తూ విజయాలు అందుకొంటున్నారు. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణది ప్రత్యేక శైలి. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బలంగా చూపిస్తారాయన.

అదీగాక, ఆయన సినిమాల్లో హీరో-హీరోయిన్స్ పెళ్లైన జంటగా కనిపిస్తారు. ‘నిన్నుకోరి’లో ఆది-నివేదా పెళ్లైన జంటగా కనిపించారు. పెళ్లికి ముందే నివేదాని ప్రేమించే వ్యక్తిగా నాని కనిపించాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండో సినిమా ‘మజిలీ’. ఇందులోనూ చైతూ-సామ్ పెళ్లైన జంటగా కనిపించబోతున్నారు. ఇక, ‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ కి కథ వినిపించాడు. విజయ్ కి కథ నచ్చింది.

ఐతే, మజిలీ రిలీజ్ తర్వాత విజయ్ తన నిర్ణయాన్ని చెబుతాడని తెలిసింది. విజయ్ ఎస్ అంటే మాత్రం.. విజయ్ పెళ్లైపోయినట్టే. ఎందుకంటే ? శివ నిర్వాణ సినిమాలు పెళ్లైన జంట కథాంశంగా తెరకెక్కుతుంటాయ్. ఈ నేపథ్యంలోనే విజయ్ కోసం అలాంటి కథనే శివ రెడీ చేసి ఉంటాడని చెప్పుకొంటున్నారు. ఇందులో నిజమెంత ? అనేది తెలియాలంటే మజిలీ విడుదల వరకు ఆగాల్సిందే.