#RRR రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఐతే, ఈ సినిమా గురించి అప్ డేట్స్ ఏమీ తెలియకపోవడంతో ప్రేక్షకులు కన్ఫూజన్ లో పడిపోయారు. ఇప్పుడీ కన్ఫూజన్ ని #RRR చిత్రబృందం తొలగించింది. ఇవాళ #RRR చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. సినిమా గురించి పూర్తి వివరాలని జక్కన్న మీడియాకు వివరించారు.

అల్లూరి సీతారామ రాజు, కొమరంభీమ్ ల కథ ఇదని రాజమౌళి తెలిపారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించబోతున్నారని తెలిపారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేటుని నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. 2020 జూన్ 30న ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.