‘బ్రోచెవరెవరురా’ విజువల్ టేల్.. చూశారా ?

విభిన్న సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రోచెవారెవరురా’ ఈ చిత్రానికి ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్, నివేదా పేతురాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజువల్ టేల్ ని విడుదల చేసింది చిత్రబృందం. చాలా విభిన్నంగా విజువల్ ట్రీట్ ని చూపించారు.విజువల్ గా పాత్రలని పరిచయం చేస్తూ.. కథ గురించి హిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విజువల్ టేల్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. బ్రేచెవారెవరురా సినిమా విజువల్ టేల్ ని మీరు ఓసారి చూసేయండీ.. !