‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ఎలక్షన్ కమిషన్.. నో యాక్షన్ !
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసుకొస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలని అడ్డుకొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. సినిమాలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని నెగటివ్ రోల్ లో చూపించే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల సినిమా విడుదలతే ఓటర్లని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అందుకే తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిలిపివేయాలని టీడీపీ నేత దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా, ఈ ఫిర్యాదుపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు.
“‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉన్నాయా ? ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా ?? ఎన్నికల కోడ్ ఉల్లంఘించే కంటెంట్ ఏమైనా ఉందా ??? అంశాలను పరిశీలిస్తాం. అవసరమైతే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చర్యలు తీసుకుంటాం” అన్నారు రజత్ కుమారు. దీంతో ప్రస్తుతానికైతే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నికల కమిషన్ నో యాక్షన్ అని తేలిపోయింది. ఈ విషయాని చెబుతూ వర్మ కూడా ట్విట్ చేశారు.
Election commission cannot take action against release of #LakshmiNTR https://t.co/c1x965K1nu
— Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2019