రివ్యూ : వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ
చిత్రం : వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ (2019)
నటీనటులు : రాయ్ లక్ష్మీ, రామ్ కార్తీక్, పూజితా పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్.. తదితరులు
సంగీతం : హరీ గౌర
దర్శకత్వం : కిశోర్
నిర్మాత : శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి
రిలీజ్ డేట్ : 15మార్చి, 2019.
రేటింగ్ : 2.5/5
కథానాయికగా కంటే ప్రత్యేక గీతాలతో తెలుగులో గుర్తింపును తెచ్చుకున్న లక్ష్మీరాయ్. చాలా గ్యాప్ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమెడియన్స్ ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రలో నటించారు. టైటిల్ వినూత్నమైన ఉండటం, టీజర్, ట్రైలర్ లలో రాయ్ లక్ష్మీ హాటుగా కనిపించడంతో.. ఈ హారర్ కామెడీపై ప్రేక్షకుల్లో ఆసక్తికలిగింది. మరీ.. వెంకటలక్ష్మీ కథేంటీ ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
చంటిగాడు (ప్రవీణ్), పండుగాడు (మధునందన్) పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతుంటారు. ఎప్పుడు ఏదో ఒక తగాదా పెట్టుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులు పెడుతుండటంతో ఊరంతా వారిని ద్వేషిస్తుంటారు. చంటి, పండు.. ఎన్ని తప్పులు చేసినా చిన్ననాటి స్నేహితులు కావడంతో శేఖర్ (రామ్‌కార్తిక్) వారికి అండగా నిలుస్తుంటాడు. శేఖర్, గౌరీ(పూజితా పొన్నాడ)ల ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్ కూడా వారిని అసహ్యించుకుంటాడు. ఐతే, ఊరికి కొత్తగా వచ్చిన వెంకటలక్ష్మి (రాయ్‌లక్ష్మి) అనే టీచర్ అంద చందాలకు చంటి, పండు ఆకర్షితులవుతారు. ఇద్దరు ఆమెను ప్రేమిస్తుంటారు. ఇంతలో వెంకటలక్ష్మీ మనిషి కాదు.. దయ్యం అనే నిజం తెలుస్తుంది. ఇంతకీ వెంకటలక్ష్మీ ఎవరు ? శేఖర్, పూజితా ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన తప్పేంటీ.. ?? అనేది మిగితా కథ.
ఎలా ఉందంటే ?
తమ కుటుంబానికి అన్యాయం చేసిన రౌడీపై ఇద్దరు జులాయి యువకులతో కలిసి ప్రతీకారం తీర్చుకునే యువతి కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ పాయింట్‌కు గ్లామర్ తళుకులు, హాస్యం అనే సొబగుల్ని అద్ది రెండు నిమిషాల కథను రెండు గంటల పాటు సాగతీశారు దర్శకుడు. రాయ్ లక్ష్మీ గ్లామర్, హీరోలుగా మారిన కమెడియన్స్ ప్రవీణ్, మధు నందన్ ల హాస్యం వర్కవుట్ అయితే.. సక్సెస్ కావొచ్చని దర్శకుడు భావించి ఉంటాడు. రాయ్ లక్ష్మీ పెద్దగా నిరాశపరచలేదు. కానీ, కామెడీ బ్యాచ్ ఘోరంగా నిరాశపరిచింది. ఎక్కడా నవ్వులు పూయించలేకపోయింది. ట్విస్టు లేవు. ఆకట్టుకొనే కథ, కథనం లేదు. దీంతో వేర్ ఈజ్ ది కథ అన్నట్టుగా సినిమా సాగింది. మొత్తంగా వెంకటలక్ష్మీ ప్లాప్ గా ఫస్ట్ షోతోనే తేలిపోయిందని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే ?
గ్లామర్ ఒలకబోయటంలో రాయ్ లక్ష్మీ స్పెషలిస్టు. వెంకటలక్ష్మీగా గ్లామర్ గా కనిపిస్తూనే మంచి నటని కనబర్చింది. ఈ హాట్ బ్యూటీని దర్శకుడు కిషోర్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. రొమాంటిక్ హారర్ సినిమా చేద్దామని బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పాయింట్ ని ఎంచుకొన్నాడు. దానికి బలమైన కథనం రాసుకోలేకపోయాడు. కమెడియన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న ప్రవీణ్ మొదటిసారి హీరో వేషాలు వేశాడు. ఆయనతో పాటు మధు నందన్.. బేవర్స్ బ్యాచ్ గా నటించారు. వీరి చేసిన కామెడీ ప్రేక్షకులని నవ్వించడం పక్కనపెడితే విసుగు తెప్పించాయ్. కథ, కథనం బలంగా లేదు. కామెడీ వర్కవుట్ కాలేదు. ఎమోషన్స్ సీన్ పండలేదు. ఫలితంగా వెంకటలక్ష్మీ బిగ్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొంది. అవన్నీ భరించి రాయ్ లక్ష్మీ అందాలని ఆస్వాదించాలనుకొనేవారు.. వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ థియేటర్స్ కి వెళ్లొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
* రాయ్ లక్ష్మీ గ్లామర్
* సంగీతం
మైనస్ పాయింట్స్ :
* కథ-కథనం
* కామెడీ
* ఇలా.. అన్నీ మైనస్సులే
చివరగా :
వెంకటలక్ష్మీలో అన్నీ ఉన్నాయనుకుంటే పొరపోటే. ఆమెలో ఏమీలేవు. అందాలు తప్ప. వాటిని దర్శకుడు సరిగ్గా చూపించలేకపోయాడు. వెంకటలక్ష్మీ భయపెట్టదు. ఏడిపించదు. నవ్వించదు. ట్విస్టులు ఇవ్వదు. తెరపై ఆమె అందాలని చూసి మురిసిపోవాలంతే.. !
రేటింగ్ : 2.5/5