వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత
ఎన్నికలకి ముందు వైకాపాలో విషాదం నెలకొంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి(68)హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.
1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు (1989, 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బాబాయ్ మరణం పట్ల జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.