బ్రేకింగ్ : వివేకానందరెడ్డిది హత్యే
వైఎస్ వివేకానందరెడ్డి హఠాత్మరణంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనది హతేనని పోస్ట్ మార్టమ్ రిపోర్టులో వెల్లడైంది. వివేకానందరెడ్డి శరీరంపై సుమారు ఏడు చోట్ల కత్తిగాట్లు ఉన్నట్టుగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నుదిటిపై రెండు లోతైన గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం ఉన్నట్టు గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా ఎస్పీ రాహుల్ చెప్పారు. ఫింగర్ ప్రింట్స్ ని గుర్తించామని తెలిపారు. అసలు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏం జరిగిందని తెలుసుకొనే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంట్లోని పని మనుషులని విచారిస్తున్నారు. మొత్తంగా వివేకాని చిత్రహింసలకి గురిచేసి చంపనట్టు తెలుస్తోంది. ఐతే, ఆ అవసరం ఎవరికి ఉంది ? హత్యకు గల కారణాలేంటీ.. ? దీనికి వెనక రాజకీయ కోణం ఉందా.. ?? అన్నది దర్యాప్తులో తేలనుంది.