కోర్టులో చిన్మయికి ఊరట

దక్షిణాదిన #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తు లైంగిక వేధించినట్టు ఆరోపించింది. డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ ప్రసిడెంట్ రాధారవిపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై రాధారవి ప్రతీకారం తీర్చుకొనే పని మొదలెట్టినట్టు ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే.. చిన్మయి డబ్బింగ్ యూనియన్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆమె గత రెండేళ్లుగా యూనియన్‌కు చెల్లించాల్సిన ఫీజును చెల్లించనందునే చర్యలు తీసుకొన్నామని తెలిపారు. దీనిపై చిన్మయి నాయపోరాటాన్ని మొదలెట్టింది.

తన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై సవాల్ చేస్తూ మార్చి 15న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో డబ్బింగ్ యూనియన్ నిర్ణయంపై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులపై చిన్మయి సందిస్తూ.. ‘ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. రాధారవి 25 తేదీ లోపు స్పందించాల్సి ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే విషయంపై వేచి చూడాల్సిందే. డబ్బింగ్ యూనియన్ నిర్ణయంపై న్యాయపోరాటం కొనసాగుతుంది’ అన్నారు.