‘డియర్ కామ్రెడ్’ టీజర్ ముహూర్తం ఫిక్స్

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన హీరోయిన్. వైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. మే నెలలో డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించబోతుంది చిత్రబృందం. ఇందులో రేపు టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత సంస్థ మైత్రీ మూవీస్ ఓ పోస్టర్ ని విడుదల చేసింది. పోస్టర్ పై రేపు ఉ॥11:11నిమిషాలకి టీజర్ ని విడుదల చేయబోటున్నట్టు తెలిపారు.

ఈ సినిమా దక్షిణాది అన్నీ బాషల్లోనూ.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. టీజర్ ని ఒకేసారి అన్నీ వర్షన్స్ ని వదలనున్నారు. గత యేడాది విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన నటించిన ద్విబాషా చిత్రం ‘నోటా’ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘గీతగోవిందం’లో విజయ్-రస్మికల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. ఇప్పుడీ జోడీ మరోసారి డియర్ కామ్రెడ్ లో రొమాన్స్ చేయనుండటంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.