‘కాంచన3’ రిలీజ్ డేట్ ఫిక్స్

లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన, కాంచన2 సూపర్ హిట్ అయ్యాయి. ఇతర బాషల్లోకి వెళ్లి అక్కడ విజయవంతం అయ్యాయి. ఈ హిట్ సిరీస్ లో వస్తున్న ‘కాంచన 3’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో ఓవియ, వేదిక హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేటుని ఫిక్స్ చేసుకొంది. ఏప్రిల్ 19న కాంచన 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది.