‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేటు మార్పు…

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల విషయంలో నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులేదు. అనుకొన్న టైం.. అంటే మార్చి 22నే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదుపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు.

మార్చి 2న విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోలేమన్నారు రజత్ కుమారు. సినిమా చూసి.. నిజంగా సినిమాలోని సన్నివేశాలు ఓటర్లని ప్రభావితం చేసేలా ఉన్నాయా.. ? అన్న విషయం తెలుసుకొన్న తర్వాత అవసరమైతే చర్యలు తీసుకొంటామని రజత్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనుకొన్న టైం రావడం పక్కా అయింది.