రాజమౌళి విలన్ ఎవరు ?


రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు, హీరోయిన్స్, కీలక పాత్రల్లో ఎవరు నటిస్తారన్నది తెలిసిపోయింది. ఇక, తెలియాల్సింది ‘ఆర్ఆర్ఆర్’ విలన్ ఎవరు ? అన్నది. నిజానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ విలన్ గా కనిపించబోతున్నారని అందరు అనుకొన్నారు. ఐతే, ఈ వార్తలపై ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీటులో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ విలన్ కాదు. ఆయన సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అని స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ విలన్ ఎవరై ఉంటారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

అత్యంత విశ్వసనీసనీయ సమాచారమ్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ విలన్ గా బాహుబలి స్టార్ కనిపిస్తారని సమాచారమ్. ప్రభాస్, రానా దగ్గుపాటిలలో ఒకరు ‘ఆర్ఆర్ఆర్’ విలన్ గా కనిపిస్తారని, ఈ విషయాన్ని జక్కన్న చాలా సీక్రెట్ గా ఉంచబోతున్నాడని చెప్పుకొంటున్నారు. సినిమా విడుదలకి చాలా కొద్దిరోజుల ముందే ఆ సీక్రెట్ ని రివీల్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ మాములుగా ఉండదు. బాహుబలి హీరోలు ఇంటర్నేషనల్ స్టార్’గా ఎదిగారు. ఇప్పుడీ హీరోలని ‘ఆర్ఆర్ఆర్’ని ప్రమోషన్ కోసం జక్కన్న చాలా తెలివిగా ఉపయోగించుకోనున్నారన్న మాట.

ఇక, అల్లూరి సీతారామరాజు, కొమర భీమ్ ల కథతో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కనుంది. అల్లూరిగా రామ్ చరణ్, కొమర్ భీమ్ గా తారక్ కనిపించనున్నారు. తారక్ జంటగా ఫారిన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్, చరణ్ జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించనుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ మల్టీస్టారర్ 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.