విజయ్ సినిమాతో సంగీత రీ-ఎంట్రీ


హీరోయిన్ సంగీత గుర్తుందా.. ? రవితేజ ‘ఖడ్గం’ సినిమాలో ‘ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్సు. అలాంటి సంగీతని తెలుగు ప్రేక్షకులు ఇప్పట్లో మర్చిపోరు. ఇప్పుడీ సీనియర్ హీరోయిన్ రీఎంట్రీ ఇవ్వబోతోంది. సంగీత దర్శకుడు క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత ఆమె సినిమాకు దూరమైంది. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో కనిపించారు. అవి తెలుగు సినిమాలు కాదు. బుల్లితెరలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత సంగీత రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ బ్యానరుపై కౌసల్య రాణి నిర్మాణంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న ‘తమిళరసన్‌’ చిత్రంలో సంగీత కీలకపాత్ర పోషిస్తున్నారు. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనికి తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. దీంతో.. సంగీత మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. ఇంకో విశేషమేంటంటే.. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.