వివేకా హత్యకేసులో ఇద్దరు అరెస్టు ?
వైకాపా అధ్యక్షుడు జగన్‌కు చిన్నాన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాజకీయరంగు పులుముకొంది. వైకాపా, తెదేపా నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొంటున్నారు. ఐతే, వివేకాది హత్యని తేలిన వెంటనే ఏపీ ప్రభుత్వం.. ఈ కేసుపై సిట్ ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టింది. జగన్ మాత్రం ఏపీ పోలీసులపై నమ్మకం లేదు. చిన్నాన్న హత్య కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు గట్టిగానే స్పందించారు.
మరోవైపు, ఈ కేసులో ఇద్దరు అనుమానితులని పోలీసులు అదుపులోని తీసుకొన్నట్టు సమాచారమ్. వారు ఎవరు ? వివేకా కుటుంబ సభ్యులా ? సన్నిహితులా.. ? తేదేపాకు చెందిన వ్యక్తులా.. ? లేదంటే.. బయటి వ్యక్తులా ? అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలావుండగా.. ఇవాళ పులివెందులలో వివేకా అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరగుతాయని తెలిసింది. పులివెందులలోని రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.