‘డియర్ కామ్రేడ్’ టీజర్ టాక్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడు. విజయ్ జంటగా రష్మిక మందన నటిస్తోంది.
మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. కాలేజ్ గొడవలు, ఓ లిప్ లాక్ తో టీజర్ ని కట్ చేశారు. కాలేజ్ గొడవల బిట్ సీన్స్ అర్జున్ రెడ్డిని గుర్తుచేస్తాయి. రౌడీ విజయ్ దేవరకొండని చూడొచ్చు. ఇక, రస్మికతో లిప్ లాక్ ఆయన అభిమానులకి సరికొత్త కిక్కునిచ్చేలా ఉంది. అది మాములు లిప్ లాక్ కాదు.. పెదాలని జుర్రేసుకొన్నారు.

సీరియస్ మూడులో టీజర్ ని మొదలై.. రొమాంటిక్ గా ముగియడం ఆకట్టుకొంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటడం ఖాయం. ఇక, టీజర్ చివర్లో సినిమాని మే 31న దక్షిణాది బాషలన్నింటినీలోనూ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాల సూపర్ హిట్స్ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయారు. డియర్ కామ్రేడ్ విజయ్ రేంజ్ ని మరింత పెంచేలా కనబడుతోంది. సౌత్ సూపర్ స్టార్ ని చేసేలా ఉంది.