జనసేనలో చేరిన జేడీ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసైనికుడిగా మారారు. జేడీ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “మంచి జ్ఞానసంపద, ధైర్యం, ప్రజాదరణ.. ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్. ప్రజల కోసం, ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. జనసైనికుల్లో తాను కూడా ఒకడిగా మారిపోయా. మనం ముందుకెళ్దాం.. దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఏంటో చూపిద్దాం” అన్నారు. లక్ష్మీనారాయణతోపాటు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలో చేరారు.
ముందుగా జేడీ తెదేపాలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఆ పార్టీలో ఆయనకి టికెట్ కూడా ఖరారైనట్టు వార్తలొచ్చాయ్. ఐతే, ఆఖరి నిమిషంలో జేడీ జనసేన చేరడం విశేషం. లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సాయంత్రానికి జేడీకి కేటాయించనున్న స్థానంపై క్లారిటీ రానుందని సమాచారమ్. రాజకీయాల్లో చేరుదామని నిర్ణయం తీసుకొన్న జేడీ తెలుగు రాష్ట్రల్లో పర్యటించారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేశారు. సొంత రాజకీయపార్టీ స్థాపించే ఆలోచన కూడా చేశారు.
ఆ తర్వాత ఆ ప్రయత్నాలని విరమించుకొని.. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ఒకదాంట్లో చేరాలని నిర్ణయించుకొన్నారు. టీడీపీలో పార్టీలో చేరేలా కనిపించాడు. ఐతే, ఫైనల్ గా జేడీ జనసేనలో చేరాడు. ఆయన చేరిక జనసేన పార్టీకి మరింత బలం తీసుకొచ్చిందని చెప్పవచ్చు.