అలీ అసలు కారణం చెప్పాడు


అలీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి మిత్రుడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే ఆయన జనసేనలో చేరడానికి అందరూ భావించారు. ఐతే, ఊహించని విధంగా వైకాపాలో చేరారు. దీనిపై అలీని ప్రశ్నిస్తే.. స్నేహం వేరు, రాజకీయాలు వేరని సమాధానం ఇచ్చారు. ఐతే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జనసేనలో చేరపోవడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టాడు అలీ.

ఇంతకీ అలీ ఏమన్నాడంటే.. ? ‘పవన్ తో స్నేహాన్ని రాజకీయాలు, సినిమాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని అనుకుంటున్నా. పైగా పవన్ జనసేనలోకి నన్ను పిలవలేదు. అందుకే నేను మరో పార్టీలోకి వెళ్లాను’ అన్నారు. అంతేకాదు.. కేవలం ఎలక్షన్స్ ప్రచారంలో వైసిపి పార్టీ కోసం పని చేస్తానని అలీ చెప్పడం కొసమెరుపు. అంటే ఆ తర్వాత అలీ జనసేనలో చేరతాడా.. ! అన్నది వేచి చూడాలి.

ఇక, కొద్దిసేపటిక్రితమే ఒకేసారి 175మంది అభ్యర్థులతో వైకాపా ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అలీకి అవకాశం దక్కలేదు. దీంతో ఆయన ఏరికోరి ఆఖరినిమిషంలో వైకాపాలో చేరిన లక్ష్యం నెరవేరనట్టయ్యింది. మరీ.. టికెట్ లభించకపోవడంపై అలీ అసంతృప్తిని వ్యక్తం చేస్తారా.. ? అన్నది చూడాలి.