కాంగ్రెస్, భాజపా ముక్త భారత్ కావాలె
మోదీకి, రాహుల్‌గాంధీ ఇద్దరూ దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారే తప్ప.. అసలైన అభివృద్ధి కోసం ఆలోచించడంలేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో తెరాస ఎన్నికల శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. 16 స్థానాల్లో గెలుపొందడంతో పాటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేలా.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామని చెప్పారు. ఈ 16 సీట్లే కాదు 150 మంది ఎంపీలను జమచేసి దేశ రాజకీయాల్లో తెలంగాణ చోదక శక్తిగా, దిక్సూచిగా మారాల్సిన అవసరముంది. దేశంలో మార్పులు రావాల్సిన అవసరముంది. అవసరమైతే.. త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానన్నారు కేసీఆర్.
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం వివిధ రాష్ట్ర నేతలతో సంప్రదింపులు చేస్తారనే ప్రచారం జరిగింది. కేటీఆర్ ని పార్తీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించడం ఇందుకు ఓ కారణమని చెప్పుకొన్నారు. ఐతే, అందుకు భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సలైంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎన్నికల ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని పక్కన పెట్టి.. జాతీయపార్టీ ఏర్పాటు చేస్తాననే అంశాన్ని తెరపైకి తీసుకొన్నారు కేసీఆర్. ఇదైనా చేస్తారా? లేదా? చూడాలి.