‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ చిక్కులు తొలగాయ్.. ఇలా !
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన సెన్సార్ బోర్డ్’పై న్యాయపోరాటానికి చేస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సెన్సార్ చిక్కులు తొలగాయని వర్మ ట్వీట్ చేయడం విశేషం. అసలు ఇంత త్వరగా సెన్సార్ చిక్కులు ఎలా తొలగాయన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
వాస్తవానికి ‘లక్ష్మీ ఎన్టీఆర్’ చిత్రానికి ఎలాంటి సెన్సార్ సమస్యలు ఎదురుకాలేదట. సెన్సార్ బోర్డుని చెప్పిన విషయాలని వర్మ ఆఫీస్ బృందం తప్పుగా అర్థం చేసుకోవడం కారణంగా సమస్య తలెత్తింది. ఇప్పుడా సమస్యలు తొలగాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వర్మ ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకి లైన్ క్లియర్ అయినట్టయింది.
There has been an unfortunate misunderstanding between our office and the CBFC which has now been cleared ..The CBFC is now doing the necessary action as per the laid down procedure ..Hence our press meet against the CBFC is cancelled ..Jai NTR💐💐💐 #LakshmiNTR
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2019