100 స్వీడు అందుకొన్న కారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ఇప్పుడు నెరవేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 100స్థానాలని గెలుచుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది. ఐతే. 88మంది స్థానాలని గెలుచుకొన్న తెరాస.. లక్ష్యానికి 12స్థానాల దూరంలో నిలిచింది. ఈలోటుని పూడ్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే ఇండిపెండెంట్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులు కలుపుకుని మొత్తం 11 మంది కారెక్కేశారు. తాజాగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెరాసలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమావెంకటేశ్వరరావు గులాభి గూటికి చేరనున్నారు. వనమా చేరికతో తెరాస బలం వందకు చేరింది.
టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరు కాక మరో ముగ్గురు హస్తం శాసనసభ్యులు కూడా గులాబీ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక లోక్ సభలో ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకి గానూ.. 16స్థానాలని గెలుచుకోవాలనే టార్గెట్ ని పెట్టుకొంది తెరాస. ఈ లక్ష్యాన్ని అందుకొనేందుకు తెరాస నేతలు శ్రమిస్తున్నారు. మరీ.. ఫలితాలు ఏలా ఉంటాయన్నది చూడాలి.