తారక్, చరణ్’లకు స్పూర్తినిచ్చే పాత్రలో అజయ్ దేవగణ్.. !


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనది విలన్ పాత్ర కాదని రాజమౌళి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగణ్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఐతే, సినిమాలో అజయ్ పాత్ర తారక్, రామ్ చరణ్ పాత్రలకి స్పూర్తినిప్పేలా ఉండబోతుందని సమాచారమ్. ఆయనది పవర్ పాత్ర. సినిమాని మలుపు తిప్పే పాత్రని చెబుతున్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమరంభీంల కథతో #RRR తెరకెక్కనుంది. వీరిద్దరిలో ఉన్నఓ కామన్ పాయింట్ తో సినిమా తెరకెక్కనుందని రాజమౌళి తెలిపారు. ఆ కామన్ పాయింట్ ఏంటంటే.. ? అల్లూరి, కొమరం భీమ్ లు ఇద్దరు యుక్త వయసులో ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. తిరిగొచ్చాక స్వాత్రంత్య్ర సమరయోధంలో పాల్గొన్నారు. వీరిలో దేశభక్తిని రగిలించే.. స్వాత్రంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చేసే పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రని జక్కన్న అద్భుతంగా మలచబోతున్నారట. కోల్ కత్తాలో మొదలు కానున్న మూడో షెడ్యూలో అజయ్ దేవగణ్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఇక, #RRRలో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ జతకట్టనున్నారు. ఎన్టీఆర్ కి జంటగా ఫారిన్ బ్యూటీ ఎడ్గర్ జోన్స్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణి. దాదాపు రూ. 400కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దాన్యయ్య నిర్మించనున్నారు. వచ్చే యేడాది జులై 30న #RRR ప్రేక్షకుల ముందుకు రానుంది.