డ్రైవర్’లకి అరకోటి ఇచ్చిన స్టార్ హీరోయిన్


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గొప్ప మనసు చాటుకొన్నారు. ఆమె వద్ద పని చేసే డ్రైవర్లకి చెరో పాతిక లక్షలు ఇచ్చింది. వాటితో డ్రైవర్లు ఇద్దరు ముంబై శివారుప్రాంతంలో ప్లాట్లు కొనుకొన్నారట. ఇటీవలే అలియా తన 26వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా తెలిసిందే. ఆ రోజే తన వద్ద చాన్నాళ్లుగా పనిచేసే సునీల్, అన్మోల్ అనే ఇద్దరు డ్రైవర్ లకి చెరో పాతిక లక్షలు ఇచ్చి సప్రైజ్ చేసింది. వీరికే కాదు.. తన మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, వంట చేసే వారు అలియా ఎంతో బాగా చూసుకొంటుందట.

ప్రస్తుతం అలియా ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ‘RRR’ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. అలియా నటించబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ చిత్రంలో అలియా రామ్ చరణ్ జంటగా కనిపించనుంది. ‘RRR’ రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో కనిపిస్తారు. ఆయన మరదలు సీత పాత్రలో అలియా కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండనున్నాయట. అల్లూరి పెళ్లి చేసుకొన్నా.. మరదలు సీతతో రొమాన్స్ చేశాడటని జక్కన్న’RRR’ ప్రెస్ మీట్ లో చెప్పారు.