‘చిత్రలహరి’ విషయంలో విచిత్రం చూశారా ?

ప్లాపుల్లో నుంచి ఫామ్ లోకి రావడానికి ఒక్క హిట్ చాలని చెబుతుంటారు. సినిమా కూడా అవసరం లేదు… ఓ మంచి టీజర్ చాలని ‘చిత్రలహరి’ టీజర్ నిరూపించింది. ఇటీవలే విడుదల చిత్రలహరి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కొన్ని గంటల వ్యవథిలోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. అంతకుమించి సినిమాకు పాజిటివ్ టాక్ తీసుకొంది. ఈ టాక్ తో సినిమాపై అంచనాలు పెరిగాయ్. అది ప్రీ-రిలీజ్ బిజినెస్ పై ప్రభావం చూపుతోంది. దాదాపు రూ. 25కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది చిత్రలహరి.

అసలే ప్లాపుల్లో ఉన్న తేజు సినిమా ఈ రేంజ్ లో ప్రీ-రిలీజ్ చేయడం ఆశ్ఛర్యాన్ని కలిగిస్తోంది. ఐతే, ఈ క్రెడితే కచ్చితంగా టీజర్ దే. చిత్రలహరి టీజర్ లో కొత్తదనం కనిపించింది. తేజుని భిన్నంగా చూపించాడు. ఎప్పటిలాగే ఓవర్ ఎనర్జితో కనిపించలేదు. సెటిల్డ్ ఫర్ ఫామెన్స్ తో కనిపించడం. నా విజయ్. నా పేరులోని విజయం.. నా జీవితంలో లేదని తేజు నీరసంగా చెప్పే డైలాగ్ వైరల్ మారింది. మొత్తంగా.. ‘చిత్రలహరి’ సినిమా అంచనాలని మించే విజయాన్ని అందుకొనేలా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టీం.