‘బిగ్ బాస్-3’ హోస్ట్’గా ఎన్టీఆర్ బాబాయ్.. !!

తెలుగు బిగ్ బాస్ విజయవంతంగా రెండు సీజన్స్ ని పూర్తి చేసుకొంది. త్వరలోనే మూడో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ కోసం హోస్ట్ గా ఎవరు వ్యవహరించబోతున్నారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్ బాస్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్లారు. ఇక, రెండో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని ఆ స్థాయి తగ్గకుండా నడిపించారు. మూడో సీజన్ కోసం మళ్లీ తారక్ ని తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం భావించింది.

అందుకు తారక్ కూడా ఆసక్తిని చూపినట్టు తెలిసింది. ఐతే, బిగ్ బాస్ కు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ అడ్డుపడుతుండటంతో ఆ ఆలోచనని విరమించుకొన్నారు. ఈ నేపథ్యంలో తారక్ స్థానంలో ఆయన బాబాయ్ ని రంగంలోకి దించాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారమ్. ఇక్కడ తారక్ బాబాయ్ అంటే బాలయ్య కాదు. నాగార్జున. నాగ్ ని తారక్ బాబాయ్ అని సంబోధిస్తుంటారు. ‘సీతారామరాజు’ చిత్రంలో తారక్ తండ్రి హరికృష్ణ, నాగ్ అన్నదమ్ములుగా నటించారు. ఇప్పటికీ ఆ వరసనే తారక్ ఫాలో అవుతుంటాడు. ఈ లెక్కన బిగ్ బాస్ సీజన్ 3కి తారక్ మిస్సయినా.. ఆయన బాబాయ్ ఒకే చెప్పనున్నట్టు టాక్.