రెండు స్థానాల నుంచి పవన్ పోటీ.. !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాలని నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పవన్ ట్విట్ చేశారు. ‘తాను రెండు స్థానాలని నుంచి పోటి చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఏ స్థానాలని నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని కొన్ని గంటల్లో చెబుతా’నని ట్విట్ చేశారు. మరోవైపు, గాజువాక, తిరుపతి స్థానాలని నుంచి పవన్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది.

ఇక, జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకొన్న ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కూడా తమ పార్టీల వద్ద ఇదే చెబుతున్నారు. టీడీపీ, వైకపా పార్టీలకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవన్నది విశ్లేషకుల మాట.