రాయ్ లక్ష్మీ ఎఫైర్లు లెక్కలేనన్నీ.. !


హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగులకి కెరాఫ్ అడ్రస్. వీటితో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్యాడ్ టాక్ తో వచ్చామా.? వెళ్లామా? అనిపించింది. రాయ్ లక్ష్మి, కేథరిన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘నీయా 2’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాయ్ లక్ష్మీ ఆసక్తికర విషయాలు పంచుకొంది.

ఇటీవల 15 కిలోల బరువు తగ్గా. ‘నీయా 2’లో మరింత స్లిమ్ గా కనిపిస్తానంది. బికినిలో అందాల ఆరబోతపై ప్రశ్నించగా.. ఇటీవల ఎక్కువగా ముంబైలో ఉన్నా. అక్కడ బికిని ధరించడం చాలా కామన్. ఆ ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినిలో చూడడం ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండని అంది. ఇక, చాలా మందితో ఎఫైర్ నడిపిన వాస్తవం. అందులో దాచేదేముందని బోల్డ్ గా సమాధానం చెప్పింది హాట్ బ్యూటీ.