రివ్యూ : కేసరి

చిత్రం : కేసరి (2019)

నటీనటులు : అక్షయ్‌కుమార్‌, పరిణీతి చోప్రా, గోవింద్‌ నామ్‌దేవ్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మీర్‌ సర్వార్‌ తదితరులు

సంగీతం: తనిష్క్‌ బాగ్చి

దర్శకత్వం: అనురాగ్‌ సింగ్‌

నిర్మాణ సంస్థ : ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌, అజ్యూర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

రిలీజ్ డేట్ : 21మార్చి. 2019

రేటింగ్ : 4.5/5

సామాజిక అంశాలను, దేశభక్తి నేపథ్య కథలను ప్రేక్షకుల చెంతకు చేర్చాలన్నది బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్ కోరిక. గతేడాది ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘గోల్డ్‌’ చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఈ ఏడాది ‘కేసరి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1897లో జరిగిన సారాగడి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చారిత్రక నేపథ్య చిత్రమిది. ‘కేసరి’ కథ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

సారాగడి ప్రాంతంలో 21 సిక్కులకు పదివేల మంది అఫ్ఘానీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎందుకు సంభవించిందంటే.. ? మన దేశం బ్రిటిష్‌ పాలనలో ఉండగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి సుమారు పది వేల మంది సైనికులు దండెత్తి వచ్చారు. వారిని భారత సైన్యంలోని సిక్కు విభాగానికి చెందిన 21 మంది సైనికులు నిలువరించారు. రెండు సేనల మధ్య భీకర పోరు జరిగింది. 1897 సెప్టెంబరు 12న జరిగిన ఈ సంగ్రామం హవల్దార్‌ ఇషార్‌ సింగ్‌ (అక్షయ్‌కుమార్‌) నేతృత్వంలోని సిక్కు సైనికుల దళం చూపిన పరాక్రమానికి ప్రతీకగా నిలిచింది. యుద్ధం తర్వాత, ముందు జరిగిన సన్నివేశాలతో ‘కేసరి’ తెరకెక్కింది.

ప్లస్ పాయింట్స్ :

* కథ-కథనం

*అక్షయ్‌ నటన

* నిర్మాణ విలువలు

* పాటలు

* యుద్ధ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

* కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా అనిపించాయి

ఎలా ఉందంటే ?

సారాగడి యుద్ధం గురించి చాలా మందికి తెలీదు కాబట్టి ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగించేలా ఉంది. దర్శకుడు అనురాగ్‌ సింగ్‌ కథ చాలా చక్కగా, ప్రేక్షకులకు అర్థమమ్యేలా తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను భారీగా తెరకెక్కించారు. దేశం గర్వించదగ్గ దర్శకులు రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ.. లిస్టులో చేరిపోయేంత ప్రతిభ అనురాగ్ లో ఉందని ఈ సినిమాతో అర్థమైంది. ఐతే. కొన్ని సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మైనస్ అయ్యింది.

ఎవరెలా చేశారంటే ?

సామాజిక సృహాని కలిగించే సినిమాలు, దేశభక్తి సినిమాలపై అక్షయ్ కి మక్కువ ఎక్కువ. ఆయన నుంచి వరుసగా ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. కేసరిలో కూడా ఈ కోవకి చెందినదే. హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో అక్షయ్ జీవించేశారు. సినిమా మొత్తంలో అక్షయ్‌ తలపాగా ధరించి ఉండాలి. చిత్రీకరణ సమయంలో తలపాగా వల్ల చెమట పడుతూ ఇబ్బందిగా ఉందని ఆయన సినిమా కోసం ఏకంగా గుండుచేయించేసుకున్నారు. ఇందులో అక్షయ్‌కు జోడీగా పరిణీతి చోప్రా నటించారు. ఆమెకి నటించే స్కోప్ దక్కలేదు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు. టెక్నికల్ గా సినిమా బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. భారీ యుద్ధ సన్నివేశాలని అద్భుతంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 4.5/5