మహేష్’కి ఇద్దరు.. ఫిక్స్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’తో బిజీగా ఉన్నారు. ఇది మహేష్ నటిస్తున్న25వ చిత్రం. మహేష్ 26వ చిత్రం ‘ఎఫ్2’ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. ఆ అవకాశం అదితిరావు హైదరికి దక్కినట్టు తెలుస్తోంది. దీంతో మహేష్ కోసం ఇద్దరు హీరోయిన్స్ దొరికేసినట్టయింది. ఇక, ఈ సినిమా ద్వారా సీనియర్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇవ్వబోతుందట.

ఇదిలావుండగా.. మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ ‘మహర్షి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో మహేష్ మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతు పాత్రల్లో మహేష్ కనిపిస్తారట. సినిమాలో మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సినిమాల స్టయిల్ లో మహర్షి ఉంటుందట. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు.