హోలీ కానుకగా ‘మజిలీ’ టైటిల్ సాంగ్


అక్కినేని అభిమానులకి హోలీ గిఫ్ట్ అందబోతుంది. అక్కినేని దంపతులు సమంత-నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం “మజిలీ”. శివ నిర్వాణ దర్శకుడు. హోలీ కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలింది. వర్షంలో సామ్ కి చైతూ గొడపట్టడం పోస్టర్ లో చూడొచ్చు. దీనిపై టైటిల్ సాంగ్ రిలీజ్ ముహూర్తాన్ని పేర్కొన్నారు. రేపు (మార్చి 21) సాయత్రం 5:04నిమిషాలకి సాంగ్ ని విడుదల చేయనున్నారు.

ఇందులో చైతూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. క్రికెటర్‌గా, ప్రేమ విఫలమై.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా కనిపించనున్నాడు. టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్ మాత్రం థమన్ అందిస్తున్నారు. పెళ్లి తర్వాత సామ్-చై కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 5న మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.