వైరల్ : మహేష్ ముద్దుల కూతురు సితార డ్యాన్స్ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బాహుబలి’ చిత్రంలోని ‘మురిపాల ముకుందా.. ‘ పాటకు సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియోని మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘వాట్ యే టాలెంట్’ అనే కామెంట్ పెట్టారు. #MySitaPapa అనే యాష్ ట్యాగ్ ని జత చేశారు.

ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. మహర్షి షూటింగ్ ఆఖరి దశలో ఉంది. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది.